షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రోజే లీకేజీ

 

 

 

 

 

 

బషీరాబాద్ జూలై 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం రోజున నూతనంగా నిర్మించిన పదిహేను లక్షల రూపాయల జెడ్పి జిఎఫ్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం రోజునే షాపింగ్ కాంప్లెక్స్ పైకప్పు నుండి లీకేజీలు కావడం చూసి కొంతమంది స్థానికులు ప్రారంభం రోజే ఇలా లీకేజీలు కావడం చూసి ముక్కుపై వేలేసుకున్నారు.ఈ షాపింగ్ కాంప్లెక్స్ చివరి బిల్లు రాలేదని డీ.ఈ కరుణాకర చారి తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి డి.ఈ కరుణాకర చారి,ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, ఎంపీడీవో రమేష్,ఏ.ఈ వంశీకృష్ణ, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు