నాంపల్లి అక్టోబర్ 12( జనం సాక్షి ) తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలుస్తారాని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మునుగోడు ఎన్నికల్లో సిపిఐ సిపిఎం బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఆకాంక్షల కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య కార్యకర్తల సమావేశాని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలు వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చాయని, 18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బిజెపికి అమ్ముడుపోయి.మునుగోడు నియోజకవర్గం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారనిన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే రాజీనామా చేస్తే 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎందుకన్నారు. 18 వేల కోట్ల కాంట్రాక్టుల డబ్బును నెలలోగా మునుగోడు నియోజకవర్గనికి అభివృద్ధి పరిచేందుకు ఖర్చు చేస్తానంటే,టిఆర్ఎస్ పార్టీ గా మేము పోటీ చేయబోమని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతుబంధు, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు లాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలనిన్నారు. బిజెపి,కాంగ్రెస్ పార్టీల నుంచి 50 మంది కార్యకర్తలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు .ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్ ,రైతుబంధు మండల అధ్యక్షుడు ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజయ్య చారి , సిపిఐ మండల కార్యదర్శి సుధన బోయిన రమేష్,ఇటం వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు పానుగంటి వెంకన్న గౌడ్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి సత్తయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల తోని టిఆర్ఎస్ గెలుస్తుందన్న మంత్రి తలసాని




