సంగారెడ్డి బిజెపి పట్టణ శాఖ సమావేశం
– కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా తెలుసుకోవాలి
-ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ అవినాష్ కుమార్ సింగ్ పాటిల్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 24 ::: సంగారెడ్డి పట్టణంలో బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ ( లక్నో ) ఎమ్మెల్సీ అవినాష్ కుమార్ సింగ్ పాటిల్ అన్నారు.గురువారం కేంద్ర పార్టీ చేపట్టినటువంటి అసెంబ్లీ ప్రవాస్ భారత్ యోజన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు రవి శంకర్ అధ్వర్యంలో జరిగిన పట్టణ శాఖ సమావేశం లో సంగారెడ్డి అసెంబ్లీకి విచ్చేసిన ఉత్తర ప్రదేశ్(లక్నో)ఎమ్మెల్సీ శ్రీ అవినీష్ కుమార్ సింగ్ పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో, బూత్ స్థాయిలో బిజెపి పార్టీనీ ఎలా బల పర్చాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేవా అని తెలుసుకొని దిశా నిర్దేశం చేయాలన్నారు . అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు . అప్పుడు పార్టీ బలోపేతానికి ఇవి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండపురం జగన్,హనుమత్ రెడ్డి, రాములు,నాయకోటి రమేష్, కసినివాసు,మందుల నాగరాజు, అశ్వంత్, మురళీధర్ రెడ్డి,పట్టణ కార్యవర్గం, పట్టణ నాయకులు,కార్యకర్తలు, శక్తి కేంద్ర ఇంచర్జులు, బూత్ అధ్యక్షులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.