హైదరాబాద్,నవంబర్18(జనంసాక్షి): రాష్ట్రంలో రాజకీయాలు అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలతో సాగుతున్నారు. అనేక సమస్యలు ఉన్నమాట నిజమే అయినా వాటిని పరిష్కరించే విధంగా చొరవ చూపడంతో పాటు, సహకరించే సాహసం ప్రతిపక్షాలు చేయలేక పోతున్నాయి. తాజాగా అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలమయ్యింది. సమస్యలను సానుకూల ధోరణిలో ప్రస్తావించి చర్చ చేయించలేక పోయింది. తెలంగాణ అసెంబ్లీలో గట్టి విపక్షంలేదని కాంగ్రెస్ నిరూపించుకుంది. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే అయినా, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఒక్కోసారి టీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంటారు. టీడీపీకి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. మజ్లిస్ ఎలాగూ టీఆర్ఎస్కి బయటనుంచి మద్దతిస్తోన్న మిత్రపక్షం. బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా అధికారికంగా నలుగురే. ఈ దశలో అసెంబ్లీలో టిఆర్ఎస్కు ఎదురు లేకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సజావుగానే సాగాయి. ఒక్కోసారి పరిస్థితులకు అనుగుణంగా అధికార పార్టీ మెట్టుదిగి ఎక్కువ రోజులు అసెంబ్లీకి సమయం కేటాయించడం కోసం ముందుకు వచ్చింది. అయినా దానిని సద్వినియయగోం చేసుకోలోకపోయారు. జానారెడ్డిని గౌరవిస్తున్నట్లే కన్పిస్తూ, విపక్షాల కోరికను మన్నించినట్లు పలు అంశాల విషయంలో వ్యవహరించడం ద్వారా సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. ఆ తరహా వ్యూహాలతో కేసీఆర్, విపక్షాలు తమను విమర్శించేందుకూ జంకే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి నేతలు జంప్ చేస్తుండడంతో ఆ పార్టీ కూడా బలం చాటలేకపోతోంది. ఇక బిజెపి కూడా పెద్దగా సాధించిందేవిూ లేదు. కేవలం మోడీ పేరు చెప్పుకుని బతకడం తప్ప పార్టీ రాష్ట్ర నేతలకు విజన్ లేకుండా పోయింది. దీంతో అన్ని పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నాయి. తమ వాదనే కరెక్ట్ అన్న రీతిలో సాగుతున్నాయి. ప్రతిపక్షాలు మూసపద్దతి వీడని కారణంగా సమస్యలను చర్చించడనాఇకి తగినకసరత్తుచేయలేదనే చెప్పాలి. అలాగే ఎక్కువ రోజులు అసెంబ్లీ నడపడానికి సర్కార్ ముందుకు చవ్చినా ఓ ప్రణాళిక మేరకు దానిని ఉపయోగించుకోలేక పోయారు. మొత్తవ్మిూద తెలంగాణ శాసన సభా సమావేశాలు అధికారపార్టీ వ్యూహాలకు అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. ప్రధాన చర్చల్లోముఖ్యమంత్రి చొరవ తీసుకొని సమాధానాలు ఇవ్వడం ద్వారా అనుమానాలు నివృత్తిచేశారు. భూమి రికార్డుల ప్రక్షాళన ఒక మహత్తరమైన కార్యక్రమం ఎలా విడమరిచారు. మొత్తం భూమి రికార్డులను చక్కది ద్దే క్లిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో సాహసంతో నేర్పుతో చేపట్టింది. భూముల రికార్డులు చక్కదిద్దడం అసాధ్యమని అన్నవారు దానిని ఎలా సంస్కరించాలో చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి ఈ ఆరోపణలను తిప్పికొడుతూ, అవసరమైతే భూ కబ్జాలపై ప్రత్యేక చర్చ జరుపుదామని సవాలు విసిరారు. రైతులకు ఇచ్చే పంటల పెట్టుబడి పక్కదారి పట్టకుండా ఈ ప్రక్షాళన ఉపయోగపడుతుందని వివరించారు. రైతు సమితుల పై అపోహలను చెదరగొట్టారు. రైతుల రుణమాఫీ పూర్తయిందని ప్రకటిస్తూ, ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే చూపించమని ప్రతిపక్షాలను నిలదీశారు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడం, రాష్టాన్రికి విద్యుత్ కొరత లేకుండా చేయడంపై కూడా వివరణాత్మకంగా వెల్లడించారు. చెప్పిన దానికన్నా వెయ్యి కొలువులూ ఎక్కువే ఇస్తామని చెప్పిన తీరు ఉద్యోగార్థులకు ధైర్యం ఇచ్చింది. ఇకనుంచి ఔట్సోర్సింగ్ విధానాలు ఉండవనీ, క్రమబద్ధీకరణలోనూ రిజర్వేషన్లు పాటిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. పాత సచివాలయ భవనం లోపాలను, కొత్తది కట్టవలసిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. మొత్తంగా విపక్షం కన్నా అధికార పక్షమే మిన్నగా నిలిచింది.




