సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు.


బోయిన్ పల్లి ఆగస్ట్ 01(జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతి సిబ్బందికి వేతనాల పెంపు, ఉద్యోగాలను పర్మినేంట్ చేయాలని మరియు కారోబార్, బిల్ కలెక్టర్లను పంచాయతి సహాయ కార్యదర్శిలుగా నియమించాలని చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపిన చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం.ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయమైనదని వారి సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కుస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, గంగిపెల్లి లచ్చయ్య, మహేందర్, ఒంటెల లక్ష్మారెడ్డి,ఎండీ రఫీ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్,జాగిరి వెంకటేష్, క్రాంతి కిరణ్, నక్క శ్రీకాంత్, వంశీ, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు