సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి …

సిసిఆర్ సభ్యుడు గద్దె రాంబాబు…
అనంతగిరి, జనంసాక్షి:
సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సిసిఆర్ ప్రతినిధి గద్దె రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన నినాదంతో మాట్లాడుతూ….సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక రకాలైన అక్రమాలను అన్యాయాలను వెలికి తీయడానికి సమాచార హక్కు చట్టం పేదవారి చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు ప్రతి కార్యాలయము నందు సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు ప్రశ్నించేతత్వం అలవాడినప్పుడే మాత్రమే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందన్నారు