సర్పంచ్ పోగుల సారంగపాణిని సన్మానించిన నాయకులు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 06 , (జనం సాక్షి ) : మండలంలోని చాగల్ సర్పంచ్, కబడ్డీ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి స్టేషన్ ఘన్పూర్ సర్పంచులఫోరం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామానికి చెంది న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు సర్పంచ్ పోగుల సారంగపాణినీ శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు బాస్కుల యాదగిరి, బాస్కుల   ఎల్లయ్య, గాండ్ల సమ్మయ్య, ఏనుగుల వెంకటేష్,
బాస్కుల సమ్మయ్య, కొమురయ్య, చేపూరి ప్రభా కర్, వెంకన్న, సురేష్, తదితర నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.