సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షునికి ఘనంగా సన్మానం.

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షునికి ఘనంగా సన్మానం.

 

సైదాపూర్ /సెప్టెంబర్ 29 జనం సాక్షి
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నికైన సోమవారం గ్రామానికి చెందిన పైడిమల్ల తిరుపతి గౌడ్ ను మండల కేంద్రంలో సర్పంచ్లు ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ… సర్వాయ పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన తిరుపతి గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సర్వాయి పాపన్న పోరాటపటిమను అందిపుచ్చుకొని మండలంలోని గీతా కార్మికుల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. నేడు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ సర్వాయి పాపన్న గుట్టలను కాపాడే విధంగా ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం గౌరవ అధ్యక్షులు చందా శ్రీనివాస్ ,అధ్యక్షులు కాయిత రాములు స్థానిక నాయకులు పెరుమళ్ళ రాజబాబు, దొనికేన వేణుగోపాల్ ,మ్యాకల మల్లారెడ్డి, పిన్ రెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు ఉన్నారు.