Tuesday, 3 November 2026

సహకార వ్యవస్థను రాష్ట్రంలో పటిష్టం చేశాం

 

ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తర్వాత బలపడ్డాయి

ఆ కొనుగోళ్ల నుండి వచ్చిన కమీషన్లతో సహకార సంఘాలు బలపడ్డాయి

సహకార వ్యవస్థను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి

సహకార రంగం అప్పులు ఇవ్వడానికి ఏర్పాటు చేయలేదు

అప్పుల ఊబి నుండి రైతాంగాన్ని బయట పడేయడానికి ఏర్పాటు చేయబడింది

ఇన్నేండ్లలో ఏ పాలకుడు రైతు గురించి ఆలోచించ లేదు .. ఏ పార్టీ రైతు గురించి ఆలోచించ లేదు

రైతుల గుండెల్లో ఉన్న ఆలోచనను ఎవరూ రైతుల గురించి ఆలోచించ లేదు

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంటికి వెళ్లి రైతు బంధు పథకం అందిస్తున్నాం

దేశంలోని మిగతా రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల పథకాలు, సంక్షేమ పథకాల గురించి ఆశ్చర్య పోతున్నాయి

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తాం

వ్యాపారులకు రుణం ఇచ్చే స్థాయికి రైతులు ఎదగాలి అన్నది ప్రభుత్వ ఆలోచన

రైతులు పంటల వైవిద్యీకరణ మీద దృష్టి సారించాలి

సాంప్రదాయ పంటల సాగు నుండి రైతులు బయటకు రావాలి

దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో 50 లక్షల ఫించన్లు ఇవ్వడం లేదు

గతంలో ఉన్న 40 లక్షల ఫించన్లకు తోడు మరో 10 లక్షల ఫించన్లు మంజూరు చేశాం

తెలంగాణ రాష్ట్రంలో రూ.200 ఫించను రూ.1000, రూ.2016 చేశాం

ప్రజల అవసరాలను గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫించన్లను పెంచారు

రైతుల కోసం రైతుబంధు, రైతుభీమ, ఉచిత కరంటు అందిస్తున్నాం

పేదలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

వనపర్తి మండలం కాశీం నగర్ లో నిర్వహించిన వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరై, గోపాల్ పేట మండలం మున్ననూర్ గ్రామంలో ఫించన్లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసి, చెన్న కేశవ స్వామి దేవాలయం సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి