సాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్యను కించపరిచిన ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

– తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరీగారి పరశురాములు.
దౌల్తాబాద్ , సెప్టెంబర్ 18, జనం సాక్షి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన చాకలి ఐలమ్మ , దొడ్డి కొమురయ్య పోరాటాన్ని కించపరిచిన బీజేపీ నాయకుడు ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ రజక రాష్ట్ర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరీగారి పరుశరాములు ఖండించారు . రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకుడు ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రెటరీ గౌరీగారి పరశురాములు మాట్లాడుతూ సాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్యను కించపరిచిన ప్రకాశ్ రెడ్డి వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు . దళిత బహుజనులు అంటే అంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ఈ రోజుల్లో ప్రజలు స్వతంత్రంగా భారత దేశంలో గర్వంగా ఉన్నారంటే కారణం ఎందరో మహనీయుల తో పాటు చాకలి ఐలమ్మ ఎనలేని ఉద్యమాలు చేసిందన్నారు. నిజాం కాలంలోనే రజాకార్ల ను తరిమికొట్టిన ఘనత వీరనారి సాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. బిజెపి నాయకులు ప్రకాష్ రెడ్డి అహంకారంతో చాకలి ఐలమ్మను దొడ్డి, కొమరయ్యను చిట్టి ఎలుకతో పోల్చడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నీవు ప్రజల కోసం ప్రతిపాదించే వ్యక్తి అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన నాయకుల గురించి ఇలాంటి దుర్భాష మాట్లాడడం సరికాదన్నారు. బే షరతుగా తక్షణమే క్షమాపణ చెప్పని ఎడల రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనల కార్యక్రమాలు ధర్నాలు, రాస్తారోకులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా యువజన అధ్యక్షులు చింతకింది కర్ణాకర్, రజక సంఘం మహిళా నాయకురాలు మైసి గారి బుధవ్వ, సచిన్, చింతకింది కృష్ణ, పీర్లపల్లి నర్సింలు, పీర్లపల్లి రవి, చింతకింది స్వామి, చింత కింది మహేష్, చెప్పాల చక్రి, మనోజ్, రాకేష్, భాను, మహేష్, గౌరీగారి స్వామి, తదితరులు పాల్గొన్నారు.