సిఎం కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి
టీఆర్ఎస్ హాయంలో పల్లె వాసుల జీవన ప్రమాణాలు మెరుగు
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట (జనంసాక్షి):సీఎం కేసీఆర్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రి, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బస్ షెల్టర్ , అంబేద్కర్ విగ్రహం, గ్రామ ముఖ ద్వారం, కళా వేదికలను మంత్రి ప్రారంభించారు.వ్యాయమ శాలకు శంకుస్థాపన కూడా చేసిన మంత్రి నూతన పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డ్ లను అందజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.గ్రామాలలో నివసిస్తున్న ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని వివరించారు.గోదావరి జలాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయన్నారు2014 కు ముందు పాలించిన జెండాలు గ్రామాలను నిండా ముంచితే , ప్రతీ గ్రామానికి కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసింది గులాబీ జెండా అని అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం నేటికీ వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ కేవలం 6గంటలు మాత్రమేనని తెలిపారు.2014 కు ముందు మేమే గొప్ప నాయకులమని చెప్పుకునే పాలకుల హాయంలో కనీసం త్రాగడానికి నీరు దొరకలేదని విమర్శించారు.2014 లో సంక్షేమ పథకాల సంగతి దేవుడేరుగు పెన్షన్ ల రూపం లో గ్రామానికి పది వేలు వస్తెనే గగనమయ్యే పరిస్థితి ఉంటే , నేడు అదే పెన్షన్ల రూపంలో వెయ్యి జనాభా గల గ్రామానికి 5లక్షల రూపాయలకు పైగా ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఇక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి,24 గంటల కరెంట్ వంటి పథకాల తో పాటు పంచాయితీల పరిధిలో అంతర్గత రహదారులు , సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి సీఎం కేసీఆర్ పల్లెల్లో జీవన ప్రమాణాలు పెంచారని కొనియాడారు.గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే 75ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తుందనీ అన్నారు.కుల రహిత సమాజమే అసలైన అభివృద్ధి అని, 8ఏళ్లుగా రాష్ట్రంలో కులాలకు, మతాలకు , రాజకీయలకు అతీతంగా జరుగుతున్న అభివృద్దే దేశం లో తెలంగాణ ను నంబర్ వన్ గా నిలబెట్టిందన్నారు. దేశ ప్రజలు , మేధావులు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటిసి జీడి బిక్షం , ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ , యాదగిరి ముదిరాజ్ , చల్లా సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, సర్పంచ్ శోభా రాణి, మాలి అనంత రెడ్డి, చిత్రం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.