Tuesday, 3 November 2026

సినిమా టిక్కెట్‌ రేట్లు పెంచడం స్వాగించాల్సిందే

హర్షం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి
హైదరాబాద్‌,మార్చి9(ఆజనం సాక్షి): చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం విూద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త ఉ.క్షలో సవరించిన టిక్కెట్‌ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పేర్నినాని గారికి ధన్యవాదాలు అన్నారు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ మునుపటిలా పుంజుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెబుతూ ఆయన మరో ట్వీట్‌ చేశారు. మాకు నిరంతరం సహకరిస్తున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారికి ధన్యవాదాలు అని రాజమౌళి పేర్కొన్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి మహేష్‌ బాబు హీరోగా మరో సినిమా ప్రారంభించనున్నారు.
………………………): టీడీపీ జెండాలు పట్టుకున్నారని పోలీసుల ఎదుటే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజియులు ఆరోపించారు. వాళ్ళే దాడి చేసి తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులు పెట్టించినందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. అధికారం ఉందని దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం చేస్తే అవే విూకు సమాధి కడతాయన్నారు. రెచ్చగొట్టడం నీచ సంస్కృతి అన్నారు. తన విూద కక్ష ఉంటే తనతోనే తేల్చుకోవాలని… కార్యకర్తల జోలికి వెళ్ళ వద్దన్నారు. అయితే తిరుణాళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూ… యువకులను రెచ్చగొడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. రాత్రి బొగ్గరం తిరుణాళ్ళలో పోలీసులపై, తన కారుపై రాళ్ళు వేశారన్నారు. జీవి మాటలు విని అమాయకులు బలి కావద్దని సూచించారు. తనపై కక్ష ఉంటే తనతో తేల్చుకోవాలని.. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు