*సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

-పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
సెప్టెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ ) తెలంగాణా రాష్ట్ర 3వ మహాసభ లను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు కొండమల్లేపల్లిలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకి విజ్ఞప్తి కోసం సాయుధ పోరాటంలో వేలాదిమంది మృతవీరుల త్యాగంతో భూమిలేని పేదలకు భూములు పంచిన చరిత్ర ఎర్రజెండాది అని అన్నారు .కేంద్రంలోని బిజెపి పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెంచుతూ పేద ప్రజల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు .ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేటుపరం చేస్తూ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తున్నారని కార్మిక హక్కుల హరించి వేస్తున్నారని ఆరోపించారు . గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీల అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు .పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు మూడెకరాల భూమి, పెండింగ్ ప్రాజెక్టులు నేటికీ పూర్తికాలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్ర మహాసభ సందర్భంగా నాలుగో తేదీన శంషాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గమ్మికొండ వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి బాణావత్ సొమ్ల, కళ్ళు చరణ్ రెడ్డి సల్లోజు మల్లాచారి, రమావత్ పర్ష నాయక్, సుంకయ్య తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు