సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుందాం హ్యట్రిక్ సీఎంగా గెలిపిద్దాం

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
అలంపూర్ ఆగష్టు 19(జనంసాక్షి )
దేశ ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశంలోనే
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న వివిధ గ్రామాల వారికి 62 మంది ముస్లిం మైనార్టీ వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీతో మంజూరైన ఒక లక్ష రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే అబ్రహం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే ని గజ మాలతో సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవాడి సంక్షేమంపై సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టిసారించి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి పేద వారికి అండగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మ హత్యలు లేకుండా పేద కుటుంబాలకు ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలను అమలు చేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తారని అన్నారు.
60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని,కాంగ్రెస్ పార్టీ కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 200 రూపాయల పెన్షన్ అందిస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఎంతో గౌరవంగా సమాజంలో జీవించేలా వారికి ఈ రెండు వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. గతంలో ఆడపిల్ల పుడితే
భారం గా భావించే నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించేబ స్థాయికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ది అన్నారు.
గతంలో ముస్లిం మైనార్టీలను ఓటర్లుగా మాత్రమే గత పాలకులు భావించారని సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారన్నారు. పేద ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి మీద లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో సకల వర్గాల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, సకల వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం ఓటు వేసి తీర్చుకోవాలని మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ గారిని తిరిగి ఎన్నుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఛైర్మెన్లు వైస్ చైర్మన్లు జెడ్పీటీసీలు, ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు, BRS పార్టీ మండలాల అధ్యక్షులు, BRS పార్టీ నాయకులు మరియు మైనార్టీ సోదర సోదరీ మణులు మరియు తదితరులు పాల్గొన్నారు.