సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన బూడిద అనమ్మ కి మంజూరైన 19,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. బాధితురాలు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంథని నియోజకవర్గ శాసనస భ్యులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ద్వారా సిఫార్సు చేసుకోగా మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో 19,500 రూపాయల మంజూరు కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు, కమాన్పూర్ మండల ఉపాధ్యక్షులు బాద్రపు శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి రాజయ్య, భూస తిరుపతి యాదవ్, సాగి శ్రీనివాసరావు, తాళ్ల శేఖర్, చిందం సతీష్, బూడిద మల్లయ్య పోగుల రాము, మామిడి రాజు, మేకల అజయ్, భూష శ్రావణ్, బొమ్మెన శ్రీను, నాగారంగా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.