సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

జనంసాక్షి, కమాన్ పూర్ : ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన ఎలబోయిన లావణ్యకి రూపాయలు 11 వేలు చెక్కు మంజూరు కావడం జరిగింది. కాగా బుధవారం జూలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్, బీఆర్ఎస్ కమాన్పూర్ మండల అధ్యక్షులు కిషన్ రెడ్డి ,ఉపసర్పంచ్ పోలు దాసరి సాయికుమార్ , మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ , ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మ మల్లు, గడప కృష్ణమూర్తి, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, కంది మల్లేష్ , దామెర సంపత్, టిఆర్ఎస్ నాయకులు రాచకొండ రవి ఎలబోయిన రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు