సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని మండల టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్ బోడ బాలు నాయక్ అన్నారు .టేకులపల్లి మండలం సులనగర్ గ్రామ నివాసి పంచాయతీ వార్డు మెంబర్ బానోత్ కమల ఇటీవల అనారోగ్యంతో వైద్యశాలలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి . దీంతో స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ దృష్టికి స్థానిక టిఆర్ఎస్ నాయకులు బోడ రమేష్ నాయక్ తీసుకెళ్లడంతో పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 54 వేల రూపాయల చెక్కును ఆమె చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు కమల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చీమల సత్యనారాయణ, బార్మవత్ శివ ,కాలే ప్రసాద్, ఎంపీటీసీ బాలకృష్ణ ,బోడ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.