సీఎం సభను విజయవంతం చేయాలి
ఏర్గట్ల ఆగస్టు 30 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని తెరాస కార్యాలయంలో మంగళవారం ఆపార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం అధ్యక్షతన నాయకులు, ముఖ్య కార్యకర్తల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాదులో సెప్టెంబర్ 5న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెరాస నాయకులు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని, హాజరయ్యే విధంగా స్థానిక నాయకులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపీటీసీ జక్కని మధు, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ అధ్యక్షులు బర్మ చిన్న నర్సయ్య, పెద్ద కాపుల శ్రీనివాసరెడ్డి, మండలంలోని సర్పంచులు గుల్లే లావణ్య గంగాధర్, భానుప్రసాద్, గద్దె రాధ గంగారం, పత్తి రెడ్డి ప్రకాష్ రెడ్డి, కట్కం పద్మ సాగర్, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.