*సీఎం సహాయనిధి నిరుపేదలకు గొప్ప వరం*
– చింతకాయల ఉపేందర్
మునగాల,ఆగస్టు04 (జనంసాక్షి): నిరుపేదల అనారోగ్య సమస్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధి తోడ్పాటునందించి పేదల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కృషి చేస్తుందని మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్ అన్నారు. గురువారం మునగాల గ్రామపంచాయతీ ఆవరణలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునగాల గ్రామానికి చెందిన శెట్టి సైదమ్మకు 32వేల రూపాయలు, చీకటి మంగమ్మకు 20వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య చొరవతో సీఎం సహాయనిధికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని కొనియాడారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకే సీఎం సహాయనిధి అందేది అని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రతి కుటుంబానికి ప్రతి సంక్షేమ పథకం అందే విధంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు కృషితో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ ఉపసర్పంచ్ ఎల్ వెంకయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్ శ్రీను, ఎల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.