సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం: జడ్పిటిసి బండి వెంకటరెడ్డ

 

కురవి ఆగస్టు-17 (జనంసాక్షి న్యూస్) :

ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని కురవి జడ్పిటిసి బండి వెంకటరెడ్డి అన్నారు. ఇటివల్లే అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన కురవి మండలం కాంపల్లి,జూజూర్ తండా గ్రామల పరిధిలోని బి వీరన్న, మన్ని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన సుమారు లక్ష యాభై వేల రూపాయల చెక్కులను బుధవారం టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల వెంకట్ రెడ్డి తో కలిసి, రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహాయ సహకారాలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని అప్పుడు ఆపదలో ఉన్న వారికి అందరికీ అందేది కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు డాక్టర్ సుందర్ నాయక్, గుండ్రాతిమడుగు సర్పంచ్ హరిప్రసాద్, శరత్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు