Tuesday, 3 November 2026

సీనియన్‌ నటి విూనాకు దుబాయ్‌ గోల్డెన్‌ వీసా

ఇటీవల కాలంలో భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
(యూఏఈ) గోల్డెన్‌ వీసాలను అందజేసి సముచిత రీతిలో గౌరవిస్తోది. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ళపాటు యూఏఈ పౌరసత్వం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రముఖ సినీనటులు షారూక్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, మమ్మూట్టి, మోహన్‌లాల్‌, పార్తీబన్‌, త్రిషా, అమలాపాల్‌ కాజల్‌ అగర్వాల్‌ వంటి వారికి ఈ తరహా వీసా ఉంది. ఇటీవల కోలీవుడ్‌ హీరో విజయ్‌ సేతుపతి కూడా అందుకున్నారు. ఇపుడు సీనియర్‌ నటి విూనాకు యూఏఈ సర్కారు గోల్డెన్‌ వీసా అందజేసింది. ఈ వీసాను స్వీకరించిన విూనా.. దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పోలో పాల్గొన్నారు. తనకు ఈ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అరబ్‌ పాలకులకు ధన్యవాదాలు తెలిపారు.