సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ కు ఘనంగా వీడ్కోలు

మల్దకల్ అక్టోబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ బదిలీపై కేటీ దొడ్డి మండలానికి వెళుతున్న సందర్భంగా గురువారము తహసిల్దార్ కార్యాలయంలో  వీడ్కోలు పలికారు.తహసిల్దార్ హరికృష్ణ, డిప్యూటీ తాసిల్దార్  మదన్మోహన్ గౌడ్,ఆర్ఐ రామకృష్ణ తోపాటు సిబ్బంది పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. సీనియర్ అసిస్టెంట్ మండలంలోని ఏడు సంవత్సరాలుగా పనిచేసే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారు.గతంలో ఏ అధికారి కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేయలేదని, మండలానికి సేవలు చేసిన అధికారిని ప్రజలు మరువ లేరన్నారు. ఎక్కడైనా అధికారి అంకితభావంతో పనిచేస్తే  గుర్తింపు అదంతాడికి అదే వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ నాగిరెడ్డి,జూనియర్ అసిస్టెంట్ మధు,రికార్డు అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం గౌడ్, సిబ్బంది సాయి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నామాల వినోద్, ఉదయ్ కిరణ్ కు ఘనంగా సన్మానించారు.