హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణ
సూర్యాపేట,అక్టోబర్ 1 (జనంసాక్షి):హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పోరులో అన్ని పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై సీపీఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి. హుజూర్ నగర్ లోని ఆర్వో కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థి శేఖర్ రావు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.




