సుదీప్‌కు విషెస్‌ చెప్పిన రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈగ మూవీ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని కిచ్చా సుదీప్‌ క్యారెక్టర్‌ ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. ఆ తర్వాత బాహుబలిలోనూ ఓ పాత్రలో మెరిశాడు సుధీప్‌. ఇక అప్పట్నుంచీ రాజమౌళికీ, సుదీప్‌ కి మంచి సంబంధం ఏర్పడిరది. అయితే తాజాగా సుదీప్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రాంత్‌ రోణ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళి, సుదీప్‌ కు, ఆ మూవీ టీంకు శుభాభినందనలు తెలియజేశాడు. సుదీప్‌ ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి, సవాళ్లను
స్వీకరించడానికి ముందుంటాడన్న ఆయన.. ’విక్రాంత్‌ రోణ’లో అతని నటనను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. విజువల్స్‌ చాలా గ్రాండ్‌ గా ఉన్నాయని, రేపు రిలీజ్‌ కానున్న ఈ చిత్ర హీరో సుదీప్‌ కు, చిత్ర టీంకు రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే భారీ బ్జడెట్‌ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ లు నిర్మించగా.. రేపు (జులై29న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.