Wednesday, 4 November 2026

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే — పిట్టా ఉపేందర్ రెడ్డి

ఎల్బీనగర్ (జనం సాక్షి )  నిజాం పాలన నుండి విముక్తి కోసం అపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్  నేతృత్వంలో ప్రారంభించిన రోజు సందర్భంగా ఆర్ కె పురం  డివిజన్  కార్యాలయంలో వారి చిత్రపటానికి   నివాళులు అర్పించడం అలాగే కొత్తపేట రైతు బజార్ దెగ్గర వున్నటువంటి చాకలి అయిలమ్మ గారు రజాకార్ల ను ఎదురించి పోరాడిన వీర నారి చాకలి అయిలమ్మ విగ్రహానికి పుల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆ నాడు ఈ తెలంగాణ ప్రజలను ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు ఏ విధంగా  దాడులు,అత్యాచారాలు, అరాచకాలకు పలుపడ్డారో మనకందరికీ తెలుసు,మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడిచించిన అకృత్యాలు ఎన్నో చేసిన ఆ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి తిరుగుబాటులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పోరాట ఫలితంగానే ఒత్తిడితో నిజాం సర్కార్ భారత సైన్యానికి లొంగిపోయి సెప్టెంబరు17న తెలంగాణ రాష్ట్రానికి విమోచన కలిగిందని అన్నారు. హైదరాబాద్ సంస్ధానం విమోచన పొంది 75  సంవత్సరాల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 17 న కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించనుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి గారు, ఆర్ కె పురం డివిజన్ అధ్యక్షులు ముంత  రాములు యాదవ్ ,చిలుకూరు శ్రీనివాస్ ,శ్రీశైలం,రమేష్ గౌడ్,కొర్ల పల్లీ స్వామి సతిష్ నేత,లింగ స్వామి, తదితరులు  పాల్గొనడం జరిగింది