సైబర్ క్రైమ్ 1930 కు పోన్ చెయ్యండి మోసగాళ్ళు నుండి రక్షణ పొందండి
అపరిచిత వ్యక్తులతో బహు పరాక్.
సర్కిల్ ఇన్స్ పెక్టర్. శ్రీనివాస్
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 జనం సాక్షి సైబర్ నేరాలు రోజు రోజు పెరిగి పోతుండటంతో సైబర్ కేటుగాళ్ల మాయ మాటలకు మోసపోతున్నారని చాలామంది అవాగహాన లేక అపరిచితుల వుచ్చులో ఇర్కుంటున్నరాని ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా కొన్ని జాగ్రత్తలు మీకు లాటరీ లేదా బహుమతి తగిలిందని ముందుగా కొంత డబ్బు పంపించాలని అంటే మీరు అత్యాశ కు పోయి ఎవరి ఖాతా లో డబ్బులు వేయరాదని అన్నారు బ్యాంక్ కె వైసి చేసుకోవాలని ఆప్ డేట్ చేసు కోవాలి అని అపరిచితుల పోన్ కాల్స్ కు స్పందించకుండా వుండాలని వివరించారు. అపరిచుతులు పంపిన క్యు ఆర్ కోడ్. స్కాన్ చెయ్యకూడని అన్నారు ఉద్యోగం కోసం ఆన్లైన్ లో అప్లయ్ చేసుకున్నారా జాగ్రత ఉద్యోగం లో సెలక్ట్ అయ్యారని ముందుగా కొంత డబ్బు చెల్లించాలని అని అంటే. అది మోసం అని గ్రహించాలని తెలిపారు వివాహ సంబంధం ఐన వెబ్ సైట్ లో పరిచయం ఐన అపరిచిత వ్యక్తులను నమ్మకండి. ఆన్లైన్ లో డబ్బులు పెడితే రెండితలు అవుతుతాయని అంటే అది మోసమని గ్రహించండి సోషల్ మీడియా లో ప్లాట్ పామ్ లో ఫేస్ బుక్ ఇన్స్ ట్రాగామ్ లో పరిచయమైన స్నేహితుల అభ్యర్థన లు అంగీకరించ వద్దని సుచించారు వాట్సాప్ ఇన్స్త్ర గ్రామ్ మెసెంజర్ లలో పోటోలు పెట్టొద్దని చాటింగ్ చెయ్యకూడదని పోటోలు పెట్టకూడదని. పెడితే మోసగాళ్ళు వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తారని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మి బ్యాంక్ వివరాలు మి మొబైల్.కు సంబంధించిన ఓటిపి లు ఎవరికి చెప్పకూడదని చెపితే మి డబ్బులు మయం అని అన్నారు సైబర్ క్రైమ్ లో మీరు ఇరుకుంటే వెంటనే1930 కి కాల్ చెయ్యాలని అపరి చితుల నుండి రక్షణ పొందాలని సూచించారు
Attachments area
|