ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్, ఆగష్టు 20(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్ గ్రామపంచాయతీలలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవల సందర్భంగా వివిధ గ్రామాల మహిళలతో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన ఘనత మన భారతీయులదని, ఆ పోరాటం వలననే భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందని, వారిని స్మరించుకుంటూ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిర్వహిస్తూ ప్రజలందరికీ భాగ స్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి దేశం పట్ల బాధ్యత భక్తి కలిగే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ఎంపిడివో వివేక్ రామ్, ఏపీఎం నాగార్జున్, బూర్గంపహాడ్ సర్పంచ్ సిరిపురపు స్వప్న, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ లు ఎడమకంటి ఝాన్సీ, ప్రత్యూష, మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక మహిళలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




