హత్యాయత్నం కేసులో ఇద్దరి రిమాండ్హత్యాయత్నం కేసులో ఇద్దరి రిమాండ్
వేములవాడ రూరల్, ఆగస్టు 18 (జనంసాక్షి): హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న నిందితులను పట్టుకొని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు గ్రామీణ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూకలమర్రి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పెద్దవేని మల్లయ్య, నర్సవ్వ భూ వివాదంలో కొడుకు తిరుపతి పై గత ఫిబ్రవరి నెలలో గొడ్డలితో దాడి చేసి గాయపరిచారు. తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా నిందితులు పరారీ లో ఉన్నారు. కాగా శుక్రవారం నిందితులు ఎదురుగట్ల నుండి నూకలమర్రి కి వెళ్ళు స్టాండ్ వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకొని, రిమాండ్ కు తరలించిన గ్రామీణ ఎస్సై మారుతి, హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్, కానిస్టేబుల్ సంపత్, హోంగార్డ్ రాణిలను సిఐ కృష్ణకుమార్ అభినందించారు.