తెలంగాణ ప్రజలు అభివృద్దికాముకులు: బోడకుంటి
హైదరాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో కేవలం ఐదేళ్లలో యాభై ఏండ్ల అభివృద్ధి పనులను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించామని మండలి చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో టిఆర్‌ఎస్ విజయం ఖాయమని అన్నారు. కాంగ్రెస్,బిజెపిలను ప్రజలు నమ్ము స్థితి లేదన్నారు. తెలంగాణ అభివృద్దిలో దూసుకుని పోతోందన్నారు.
నియోజకవర్గ ప్రజలే ఊపిరిగా, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గానికి పాలకునిగా కాకుండా సేవకుడిగా తమ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని అన్నారు. కెసిఆర్ పట్టుదలతో తెలంగాణ సస్యవ్యామలం అవుతోందని అందుకే ప్రజలు ఆశీర్వదించి వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్‌ను గెలిపించారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు సాధించమాన్నారు. సీఎం కేసీఆర్ ఎల్లవేళాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఓ గొప్ప నాయకుడని, ఆయన టీమ్‌లో పనిచేయడం తన అదృష్టమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏమి చేశారో అని స్పష్టంగా తెలుసని, ఉపఎన్నికల్లో కూడా మళ్లీ తగిన బుద్ది చెబుతారని తెలిపారు. హుజూర్ నగర్ కూడా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.




