హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం

ఖానాపురం జూలై 25(జనం సాక్షి )
తెలంగాణ ప్రభుత్వం మరియు వరంగల్ సి.పి. ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఖానాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ మంగళవారం మృతి చెందగా సూర్యనారాయణదహన సంస్కారాల కోసం 20 వేల రూపాయలు పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున
మృతుడికుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్సై పి.తిరుపతి, వరంగల్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శోభన్ మరియు ఖానాపూర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు