16న ఇందిరా పార్క్‌ వద్ద దీక్ష: నాగం జనార్థనరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ నాయకుల్లో ఉన్న అనైక్యతే ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రధాన  అడ్డంకి అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డి  అన్నారు. తెలంగాణ కోరుకునే నేతల్లో ఐక్యత  లేకపోవడమే ఆజాద్‌ లాంటి వాళ్లు  ఇష్టానుసారం మాట్లాడేందుకు అస్కారమిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ఆజాద్‌ వ్యాఖ్యాలను ఢిల్లీలో ఉన్న  ప్రజాప్రతినిధులు ఎందుకు ఖండించరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత నేతల ఐక్యత  కోసం  ఈ నెల 16న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఒక్కరోజు దీక్ష చేయనున్నట్లు నాగం జనార్థనరెడ్డి తెలియజేశారు.