2002-2003 పదవ తరగతి స్నేహితులు కలిసిన వేళ

బచ్చన్నపేట అక్టోబర్ 16 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో 20 సంవత్సరాల తర్వాత2002 2003 సంవత్సరాలలో పదవ తరగతి చదువుకోని 20 సంవత్సరాల తర్వాత మండల కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చదువుకుంటేనే జ్ఞానం. తెలివి. సమాజ విలువలు తెలుస్తుందని ఉపాధ్యాయులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఉపాధ్యాయుల విలువల గురించి మాట్లాడారు. మేము చదువుకున్న పాఠశాలకు . మరియు మా తోటి చదువుకున్న స్నేహితులకు మాకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని తల్లిదండ్రులను గురువులను . ఎప్పుడు మర్చిపోమని ఎల్లవేళలా పూజిస్తామని వారు అన్న మాటలకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి. ఐలయ్య. బాల కుమార్. సోమిరెడ్డి. నాగభూషణ్. బాలరాజు. శ్రీనివాస్. నరసింహారెడ్డి. కవిత గురువులకు సన్మానం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు