Friday, 6 November 2026

August 2012

వార్తలు

లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌ సభ సమావేశమైన కొద్దిసేపటికే నల్లధనం, పాకిస్థాన్‌లో హిందువుల అక్రమకేసులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…

హైదరాబాద్

రేపు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: బోధనా రుసుముల చెల్లింపుల వివాదం కొలిక్కిరావడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగుమమైంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గఉపసంఘం భేటీలో భోదనాఫీజును రూ. 35వేలకు…

హైదరాబాద్

వాన్‌పిక్‌ కేసులో నేడు సీబీఐ ఛార్జ్‌షిట్‌

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఛార్జ్‌షీటీ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్దమయ్యారు. వాన్‌పిక్‌ ప్రతినిధులు నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసి ఇప్పటికి…

వార్తలు

జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం ఏడుగురి మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని సీతామార్హి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్మా గ్రామం వద్ద ఓ బస్సు బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

బాలకృష్ణతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే భేటీ

హైదరాబాద్‌: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సినీ నటుడు బాలకృష్ణతో భేటీ అయ్యారు. తెదేపాలో చేరాలని బాలకృష్ణ ఈ సందర్భాంగా వెంకటేశ్వరరావుకు సూచించారు. బాలకృష్ణ సూచన మేరకు త్వరలో తెదేపాలో చేరునున్నట్లు ఆయన ప్రకటించారు.

జిల్లా వార్తలు

కారుబొల్తా: ఒకరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్‌ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 57, 474 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకువిడుదల…

వార్తలు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 12 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

వాగులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఏనుగుగడ్డవాగులో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి మృతిదేహం లభ్యమైంది. మృతున్ని కంచికచర్లకు చెందిన పొరమ సురేందర్‌గా గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి సురేష్‌ కోసం  గాలింపు  చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న…

వార్తలు

శ్రీశైలం జాలశయంలో పెరుగుతున్న నీటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగేతోంది. జలాశయంలోకి 51 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 801 అడుగులుగా ఉంది.