Tuesday, 3 November 2026

August 2012

ఆదిలాబాద్

ఎంఐఎంచే ఇఫ్తార్‌ విందు

ఆదిలాబాద్‌: ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్

అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులు

బెజ్జూరు: మండలంలోని కొండపల్లిలో అంతుచిక్కని వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే మూడు పశువులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. పశువులకు కళ్లలో నుంచి నీరుగారి చూపు కోల్పోయి మృతిచెందుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.

వార్తలు

హైదరాబాద్‌లో హైఅలర్ట్‌

హైదరాబాద్‌: మహరాష్ట్రలో బాంబు పేలుళ్లతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు కమిషనర్‌ అనురాగ్‌శర్మా తెలిపారు. నగరంలో పలు చోట్ల పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మానవపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాటు స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోరప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగివున్న లారీని అంబులెన్స్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

వార్తలు

రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

హుజురాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నర్విహించారు. ఈ సందర్భంగా 1222 క్వింటాళ్ల బియ్యం నిల్వలను అధికరులు గుర్తించారు.

వార్తలు

పుణెలో బాంబు పేలుడు

పుణె: మహరాష్ట్ర లోని పుణె నగరంలో జేఎం రోడ్డు లోబాంబు పేలుళ్లు సంభవించాయి. నగరంలోని మెక్‌ డొనాల్స్డ్‌, గంధర్వ్‌ ధియేటర్‌ సమీపంలో ఐదు బాంబు పేలుళ్లు సంభవించినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

సీమాంధ్ర

ఘనంగా కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 1 : కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకానంతరం ఆలయంలోకి భక్తులకు అనుమతించారు. ప్రతి శ్రావణమాసంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం అనవాయితీ. కాగా, అందుకు తగిన విధంగా ఆలయ అధికారులు…

సీమాంధ్ర

బెల్టు దుకాణాలపై మహిళల దాడి

విజయవాడ, ఆగస్టు 1 : మద్యం బెల్టుషాపులపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. నందిగామ మండలం దామలూరు గ్రామంలో మంగళవారం మహిళలు విజృంభించారు. గ్రామంలో అనధికారికంగా వెలిసిన బెల్టు దుకాణాలను తొలగించమని ఎక్సైజ్‌…

సీమాంధ్ర

వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరిక

కడప, ఆగస్టు 1 : పార్టీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి జైలులో ఉన్నా వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం భవిష్యత్‌లో పార్టీ విజయానికి నిదర్శనమని వైఎస్‌ఆర్‌ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. చిత్తూరు జిల్లా ఊతలపట్టు…

సీమాంధ్ర

విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్టు

విజయవాడ, ఆగస్టు 1 : రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి చందర్లపాడు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దానిపై దళిత…