Thursday, 5 November 2026

August 2012

జిల్లా వార్తలు

వరంగల్‌లో డెంగ్యూ విజృంభణ

వరంగల్‌: డెంగ్యూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. తొర్రూరు మండలం బొమ్మకల్‌లో డెంగ్యూ ప్రబలండంతో 70 మంది తీవ్ర అస్పస్థతకు గురయ్యారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. అయినా ప్రభుత్వా వైధ్యాధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల బంధువులు ఆరోపించారు.

కరీంనగర్

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమయింది. ఆసియామార్కెట్లలో అనుకూలధోరణి ఏర్పడటం దేశీయస్టాక్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్‌ 84 పాయింట్ల ఆధిక్యంతో నిఫ్టీ 2.4 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్‌కు చెందిన అన్నీ సూచీలు లాభాల్లో వున్నాయి.

వార్తలు

పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాగ్‌రగడ మొదలైంది. కాగ్‌ నివేదికపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ వ్యక్తం చేశాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌, రాజ్యసభ…

హైదరాబాద్

వైద్యులపై దాడి చేసిన వారి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడి చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమపై దాడికి నిరసనగా జూనియర్‌ వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టడం తెలిసిందే. సమ్మెపై వారు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు…

హైదరాబాద్

సమావేశం ఏర్పాటుచేస్తే దీక్ష విరమిస్తా: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మానుకొని విద్యుత్‌ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీక్ష విరమిస్తానని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి  దయాకరరావు స్పష్టంచేశారు. దీక్ష విరమించమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేయగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఊదు గాలింది..పీరు లేచింది తెలుగు ముస్లింల ఆస్తిత్వ కాంక్షకు అక్షర రూపం ‘జల్‌జలా’ చిమ్మ చీకట్లో గణగణమని వినబడే సైకిల్‌ గంట చప్పుడు, ఇరుకు సందులు, గుడ్డి గల్లీలు, గతుకుల రోడ్డు మీదుగా లైట్‌ లేకుండా స్పీడ్‌గా తొక్కుతూ…

ఎడిట్ పేజీ

కేసీఆర్‌ జీ 20 వ తారీఖు అయిపోయింది..

కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 20వరకు డెడ్‌లైన్‌ ఆ తర్వాత తెలంగాణ రాకుంటే ఉద్యమం  తీవ్ర రూపం దాలుస్తుందంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వామిగౌడ్‌ సన్మాన సభలో అన్న మాటలు. అయితే మరి కెసిఆర్‌కు గుర్తు ఉందో లేదో…

వార్తలు

ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

అంతర్వేది: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురిని మత్స్యకారుల్లో ఆరుగురిని రెవెన్యూ సిబ్బంది. రక్షంచారు. మరో మత్స్యకారుడి కోసం నావికాదళం హెలికాఫ్టర్‌లో గాలింపు చర్యలు జరుపుతున్నారు. బెండ్లుచ బోదెల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నట్టు మత్య్సకారులు తెలియజేశారు.

వార్తలు

రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ మృతి

రావులపాలెం: తూర్పుగోదావరి  జిల్లా రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ రాంబాబు అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. పోలీసులు శవాన్ని హడావుడిగా శవపరీక్షకు తరలించడం పలు అనుమానాలకు దారి తీసింది.