Monday, 2 November 2026

September 2012

వార్తలు

నెక్లెస్‌ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న నెక్లెస్‌ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం తెలంగాణ కవాతుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి సమయం ముగిసింది. కానీ నిర్వాహకులు మాత్రం తెలంగాణ వచ్చే వరకూ ఇక్కడే కూర్చుందామని ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.…

వార్తలు

సాగరహారంలో రహిమున్నిసాకు గాయాలు

హైదరాబాద్‌: విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా చెప్పు చుపించి తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని చాటిన రహిమున్నిస హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సాగారహారంపై పోలీసులు జరిపిన భాష్ప వాయువు దాడిలో గాయపడింది.

వార్తలు

కవాతు వేదికవైపు టియర్‌గ్యాస్‌ ప్రయోగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ వేదికపైకి బాష్పవాయుగోళాలను పోలీసులు ప్రయోగించి రాక్షసానందం పొందుతున్నారు. టియర్‌గ్యాస్‌ వాయువు ఉక్కరి బిక్కిరి చేస్తున్నా, పైనుంచి భారీ వర్షం పడుతున్నా వాటర్‌ కేనన్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా తెలంగాణవాదులు మొక్కవోని దీక్షతో మార్చ్‌…

వార్తలు

వార్తా ఛానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి: కేసీఆర్‌

ఢిల్లీ: వార్తా ఛానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని తెరాస అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఛానెళ్ల ప్రాసారాల నిలిపివేత అత్యవసర పిరస్థితిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. టీవీ ప్రసారాల నిలిపితేలకు డీజీపీ ఆదేశాలు జారీచేయడం అప్రజాస్వామికమన్నారు.…

వార్తలు

తెలంగాన బంద్‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణవాదులు, విద్యార్థులపై పోలీసు దాడులకు నిరసనగా తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. బంద్‌కు యావత్‌ తెలంగాణ ప్రజానీకం సహకరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

వార్తలు

కవాతు ఇచ్చిన అనుమతి సమయం ముగియడంతో భాష్సవాయువు ప్రయోగం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు నిర్వహణకు ఇచ్చిన అనుమతి సమయం ముగియడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వాటర్‌ క్యానన్‌లు, భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. కవాతువేదికవైపు భాష్ప వాయువు ప్రయోగిస్తున్నా నేతలు మాత్రం అక్కడి నుంచి కదలకుండా వేదికపైనే కూర్చున్నారు.…

వార్తలు

వర్షాన్ని కూడా లెక్కచేయని తెలంగాణ వాదులు

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో నిర్వహిస్తున్న తెలంగాణ కవాతు వర్ష్‌ంలో కొనసాగుతోంది. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ వాదులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నెక్లెస్‌రోడ్డులోనే ఉన్నారు. నగరంలోని పలుప్రాంతాల్లో ఆదివారం రాత్రి…

వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

కొలంబొ:  పాకిస్థాన్‌, భారత్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

తెలంగాన మార్చ్‌ను భగ్నం చేసేందుకు యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వాటర్‌ కెనాన్లతో సభాప్రాంగణంలోని జనాన్ని బయటికి తరమడానికి పోలీసులు యత్నిస్తున్నారు. బోరున వర్షం కురుస్తున్నా జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది.

వార్తలు

శాంతియుతంగా కవాతు నిర్వహించాలి: హోంమంత్రి

హైదరాబాద్‌: శాంతియుతంగా కవాతు నిర్వహించాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. తెలంగాణవాదులు ఉద్రేకాలకు లోనుకావద్దని విజ్ఞప్తిచేశారు. పోలీసులు కూడా సంయమనం పాటించాలని హోంమంత్రి సూచించారు.