Tuesday, 3 November 2026

October 2012

వార్తలు

విద్యుత్‌ కొరత నివారించే మార్గాలను ముఖ్యమంత్రికి సూచించాను: రామచంద్రయ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని దీన్ని నివారించే మార్గాలే తాను ముఖ్యమంత్రికి సూచించినట్టు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. సచివాలయంలో ఆయన సీఎంతో సమావేశమయ్యారు. విద్యుత్‌ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలను…

వార్తలు

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: టీజీ

న్యూఢిల్లీ: రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్రమంత్రి, రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ కోరారు. కర్నూలు నుంచి రాజధానిని తరలించడంతో సీమ ప్రాంతం దాదాపు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం…

వార్తలు

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ బెయిల్‌పిటిషన్‌ విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 9కి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై మోపిదేవి తరపు న్యాయవాది, సీబీఐ న్యాయవాదులు తమ వాదనలు ముగించారు. ఇరుపక్షాల వాదనలు…

వార్తలు

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: ఇండోనేషియాలోని కెపులావన్‌బాటు సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది.

వార్తలు

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంలో కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు కోరారు. తెలంగాణపై ఇప్పటికే స్పష్టమైన వైఖరి ప్రకటించిందన్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్‌…

వార్తలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో రేణుకాచౌదరిని అడ్డుకున్న తెరాస శ్రేణులు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రేణుకాచౌదరిని శంషాబాద్‌ విమానాశ్రయంలో తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. ఢిల్లీనుంచి వచ్చిన ఆమె బయటకు వెళుతుండగా తెరాస కార్య కర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తానూ తెలంగాణ బిడ్డనే నంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం…

వార్తలు

ఎంబీబీఎస్‌ పార్ట్‌-2 ఫలితాల విడుదల

విజయవాడ: ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి ఏడాది పార్ట్‌ -2 ఫలితాలను విడుదల చేసినట్టు ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యలయం తెలిపింది. యూనివర్శిటీ వెబ్‌సైట్లో ఫలితాలను వీక్షించవచ్చు. బీడీఎస్‌ ఫైనల్‌ ఫలితాలను కూడా విడుదల చేసినట్టు యూనివర్శిటీ అధికారులు…

వార్తలు

సికింద్రాబాద్‌-ముబయిల మధ్య 12 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: దసరా, దీపావళి పండుగల సందర్భంగా సికింద్రాబాద్‌-ముంబయిల మధ్య 12 ప్రత్యేక ఏసీ రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14 నుంచి నవంబరు 19 వరకు ఈ రైళ్లు నడుస్తాయని రైల్యే అధికారులు తెలిపారు.

వార్తలు

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ 45.78 పాయింట్ల లాభంతో 18,869.69 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.45 పాయింట్ల ఆధిక్యంతో 5,731.25 వద్ద స్థిరపడ్డాయి. చమురు, గ్యాస్‌, పబ్లిక్‌ రంగ సంస్థలు, ఆరోగ్య లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,…

వార్తలు

సోనియా గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం

రాజ్‌కోట్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గుజరాత్‌లో ఆ రాష్ట్ర విధానసభ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించారు. భాజపా రాష్ట్రాల్లోనే అవినీతి అధికంగా ఉందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తన వైద్యఖర్చులపై మోడీ చేస్తున్న విమర్శలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.