Tuesday, 3 November 2026

22న మెగా జాబ్‌మేళా

మేడ్చల్‌,మే18(జ‌నంసాక్షి):  మేడ్చల్‌ ప్రభుత్వ ఐటీఐలో 22న మెగా అప్రెంటీస్‌ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన ఇంటర్‌, ఐటీఐ చదివిన వారు 500 మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాను తెలంగాణలోని అన్ని జిల్లాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.