పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి- కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికారి కిషన్ జి
మంథని, జనం సాక్షి : పార్లమెంటు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ బిసి బిల్లు ప్రవేశపెట్టాలని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోటికారి కిషన్ జి గురువారం ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటి బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తుందని, మండల్ కమిషన్ సర్వే ఆధారంగా కాకుండా ప్రస్తుతం బీసీ జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే చట్టసభల్లో అవకాశం కల్పించినట్లు అవుతుందని, వచ్చే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.