47వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె

అశ్వరావుపేట సెప్టెంబర్ 9( జనం సాక్షి )

 

స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు
కెసిఆర్ ఇచ్చిన హామీనలు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదు
వీఆర్ఏల తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చినహామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని 47వ రోజు నిరవధిక సమ్మెకు పలువురు సంఘీభావం తెలిపినారు ఈ సందర్భంగా వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని అర్హులైన వారికి ప్రమోషన్ కల్పించాలిని 55 సంవత్సరాల పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దాసరి శ్రీనివాసరావు, ఊకే రమేష్, చిలకారావు, సత్యనారాయణ, జక్కుల ఏసు, బానోతు నాగరాణి, జొన్నలగడ్డ నాగేష్, వెంకటేశ్వర్లు, రాము, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.