హైదరాబాద్ : తాగిన మైకంలో నగరానికి చెందిన ఓ యువతితోపాటు ఆమె స్నేహితులు కొందరు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హంగామా స్పష్టించారు. ఎయిర్‌పోర్టులోని గేమ్స్ జోన్ సిబ్బందిపై దాడి చేసి చితకబాదారు. దీంతో ఎయిర్‌పోర్టులోని సిబ్బంది వారిని పట్టుకోని పోలీసులకు అప్పగించారు.హైదరాబాద్‌కు చెందిన వీరంతా గత అర్ధరాత్రి మద్యం తాగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గేమ్స్ జోన్‌కు చేరుకున్న యువతులు సిబ్బందితో ఘర్షణ పడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశారు. ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీసులు దాడికి పాల్పడిన యువతితో పాటు ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.




