Tuesday, 3 November 2026

69 సంస్కార్‌ కాలనీతో పలకరించనున్న ఎస్తేర్‌

వెయ్యి అబద్దాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఎస్తేర్‌ నొరోహా.. త్వరలో ’69 సంస్కార్‌ కాలనీ’ సినిమాతో వస్తోంది. అజయ్‌, రిస్వి తిమ్మరాజు ఇతర ముఖ్య పాత్రల్లో పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి బి.బాపిరాజు, ముతికి నాగసత్య నారాయణ నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఎస్తేర్‌ మాట్లాడుతూ ’ఇందులో నేను వైశాలి అనే గృహిణిగా నటించా. ఇలాంటి బలమైన పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ట్రైలర్‌ చూసి బోల్డ్‌గా ఉందంటున్నారు. నిజానికి ఈ మూవీ కంటెంట్‌లో అదే నాకు కిక్‌ ఇచ్చింది. చాలామంది జీవితాల్లో అలాంటి బోల్డ్‌నెస్‌ ఉంటుంది. కానీ ఎవరూ మాట్లాడుకోరు. సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే ఇలాంటి చిత్రంలో నటిస్తే మంచి పేరొస్తుందని ఫీలయ్యాను. ’రా రా’ అనే ఓ పాట కూడా పాడాను. సోషల్‌
విూడియాలో ఈ పాటకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. నేను నటించిన ’ఐరావతం’ కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ’రుద్ర’ అనే మరో మూవీతో పాటు జీ5 కోసం ఒక వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాను’ అని చెప్పింది.