75వ స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి అధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుండి సుమారు 3 బస్సులలో జిల్లాలోని ప్రజా ప్రతి నిధులు, అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ లు, రైతు బందు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు అందరిని ఈ నెల 22 న హైదరాబాద్ లో జరిగే వ జ్రో త్స వాల ముగింపు కార్యక్రమానికి తీసుకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించారు . 22 న ఉదయం 9.00 గంటలకు జిల్లా కేంద్రం నుండి బస్సులు బయలుదేరాలని సూచించారు. బస్సులలో త్రాగు నీరు, భోజన సౌకర్యాలు సమకూర్చాలని అన్నారు. హైదరాబాద్ వెళ్లే వారందరికీ గుర్తింపు కార్డులు అందజేయాలనీ ఆదేశించారు.టే లి కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జడ్ పి సి ఇ ఓ విజయనాయక్, డి ఆర్ డి ఓ నాగేంద్రం,డి పి ఓశ్యామ్ సుందర్, డి ఇ ఓ సిరాజుద్దీన్, వ్య వసాయ శాఖ అధికారి గోవిందు నాయక్, శిశు సంక్షేమ అధికారి ముసయిదా బేగం, ఇంటర్ మీడియట్ నోడల్ అధికారి హృదయ రాజు, ఇ డి ఎస్సి కార్పొరేషన్ రమేష్ బాబు, డి పి ఆర్ ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.