Tuesday, 3 November 2026

9వ రోజు వీఆర్ఏ నిరవధిక సమ్మె ..

చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపిన వీఆర్ఏలు…
వెంకటాపూర్(రామప్ప)ఆగస్టు 02,(జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 9వ రోజులో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె శిబిరం వద్ద చీపుర్లతో ఊడ్చి నిరసన తెలపడం జరిగింది. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు అసెంబ్లీలో  ముఖ్యమంత్రి హామీ లు అయినా పే స్కేల్ జీవో, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చుటకు రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య, వెంకటాపూర్ వీఆర్ఏ మండల అధ్యక్షులు నక్క శశి కుమార్,ఉపాధ్యక్షులు తొగరి మురళి, ప్రధాన కార్యదర్శి మంతెన స్వప్న,  రడపు సరిత,సునీత, కుమారస్వామి,శ్రీకాంత్, మొగిలి,కిషన్, రాజ మొగిలి,మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.