Friday, 13 November 2026

హైదరాబాద్

కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని కలిసిన కోదండరాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కలిశారు. కేంద్రం తెలంగాణ అంశంపై త్వరగా తేల్చాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ నిర్ణయాన్ని కార్యచరణలో చూపెడతామని…

జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్‌ అన్నారు. నెలరోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూనియర్‌ డాక్టర్ల్‌ తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మార్గాలు విఫలమైతే…

భాజపా కార్యకర్తల అరెస్టు

ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రధాని నావాసం వద్ద ఆందోళనచేసిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళుతున్న వారిని అడ్డుకుని వాటర్‌క్యానన్లు, భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు…

బొగ్గు కుంభకోణంలో నన్ను ప్రశ్నించలేదు:దాసరి నారాయణరావు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణంలో సీబీఐ అధికారులు తనను ప్రశ్నించలేదని తనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల్లో సోదాలు జరగలేదని దాసరి నారాయణరావు తెలిపారు. బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఆ శాఖలో సహాయమంత్రిగా పనిచేసిన దాసరి…

మండలి బుద్ధప్రసాద్‌ దీక్ష విరమణ

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ మూడురోజులుగా దీక్ష చేస్తున్న మండలి బుద్దప్రసాద్‌ ఈ రోజు దీక్ష విరమించారు. డెల్టాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న ప్రభుత్వ హామీతో ఆయన దీక్షను విరమించారు.

తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి:కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. తెలంగాణలో ఆత్మబలిదానాలను కేంద్ర ప్రభుత్వ…

హైకోర్టు తీర్పు మంచి నిర్ణయం: ఎమ్యేల్సీ వై. బి. రాజేంద్రప్రసాద్‌

విజయవాడ: స్థానిక సంస్థలకు ఎన్నికలను జరిపించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం మంచి నిర్ణయమని తెదేపా ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్‌ విజయవాడలో అన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేకధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల పనులు అగిపోయాయని…

ఎస్సీ, ఎస్టీ పదోన్నతులు తొలగిన అడ్డంకులు

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల అడ్డంకులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఇందుకు పచ్చజెండా వూపింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు…

ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయం: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయమని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ అయన జంతర్‌మంతర్‌ వద్ద బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరు దీక్ష శిభిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. శిభిరంలో ప్రసంగిస్తూ..…

తెలంగాణపై బీజేపీ మాట తప్పింది: సీపీఐ

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని నమ్మబలికి తెలంగాణ ప్రజలను బీజేపీ వంచించిందని విమర్శించారు, తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్‌లది…