Wednesday, 11 November 2026

వార్తలు

జై ఆంధ్ర ఉద్యమని కొనసాగిస్తామం: వసంత

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది. బహిరంగసభ కోసం ర్యాలీగా బయలుదేరిన జేఏసీ గౌరవ అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావును పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ర్యాలీలోని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…

చిన్నారి అపహరణకు యత్నం

విశాఖ: విశాఖపట్నం కేజీహెచ్‌ పిల్లల వార్డులో చిన్నారిని అపహరించేందుకు ముగ్గురు సభ్యులముఠా యత్నించింది. ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు మహిళలు,ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బొగ్గు కేటాయింపుల పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: కాగ్‌ నివేదికపై ఆధారపడటంలో తప్పులేదని, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్రం వివరణ అవసరమని తెలియజేశారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంలో విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ కేసులో తమ తరపున వాదనలు వినిపించే న్యాయవాదుల మార్పుపై సీబీఐ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు నిన్న మీడియాలో…

సోంపేట కాల్పులు ఘటన కేసు వాయిదా

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకేసును హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాల్పులు కేసు విచారణ నివేదికను నాలుగు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి మెజిస్ట్రేట్‌ విచారణ పూర్తియిందని అడ్డకేట్‌…

కూడంకుళంలో కొనసాగుతున్న ఆందోళన

చెన్నై: కూడంకుళం  అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఏడో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామస్థులంతా మానవహారంగా ఏర్పడి సముద్రం నీటిలో చేపట్టిన జల సత్యాగ్రహం కొనసాగుతోంది.ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. ప్లాంట్‌ మూసివేసేంత వరకూ…

గ్యాటిమాలలో బద్దలైన ఆగ్నిపర్వతం

గ్యాటిమాల: మెక్సికో సరిహద్దు గ్వాటిమాలలోని పర్యాటక కేంద్రం సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో  3కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిసర ప్రాంతాల్లోకి లావా ప్రవహిస్తుండటంతో సుమారు 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివేళ్లాల్సిందిగా అధికారులు…

సాంకేతిక లోపంతో నిలిచిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.