Wednesday, 11 November 2026

వార్తలు

శ్రీహరికోట షార్‌ సెంటర్లో హై ఎలర్ట్‌

సూళ్లూరుపేట: శ్రీహరికోట షార్‌ సెంటర్లో ఈ నెల 9వ తేదీన పీఎస్‌ఎల్‌వీ పీ 21 రాకెట్‌ ప్రయోగం ఉంది. రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం షార్‌ హై ఎలర్ట్‌ ప్రకటించింది

ఐదుగురు మత్స్యకారుల గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా: ఐ.పోలవరొం మండలం భైరవపాలెం వద్ద ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరందరూ విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన వారు. సముద్రతీరంనుంచి 18 కి.మీ.దూరంలో పడవ ప్రమాదానికి గురైనట్టు సమాచారమందింది. గల్లంతయినవారి కోసం రెవెన్యూయంత్రాంగం గాలింపుచర్యలు చేపట్టింది.

నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం

హైదరాబాద్‌: నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ బి. వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిని పవర్‌ పాయింట& ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో పేదల కోసం కోటి పక్కా…

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరిక

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరనుంది. తుంగభద్ర, అలమట్టి ప్రాజెక్టులకు కలిసి 80వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో మరికొన్ని రోజులపాటు శ్రీశైలానికి నీరు వదిలే అవకాశముంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు రెండూ…

పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం: బొత్స

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. కానీ, రాజ్యాంగం, న్యాస్థానం తీర్పులను గౌరవించాల్సి ఉందని తెలిపారు.

సమ్మె విరమించి విధుల్లో చేరితేనే చర్చలు జరుపుతాం

హైదరాబాద్‌|: జూనియర్‌ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, విధుల్లో చేరితేనే మళ్లీ వారితో చర్చలు జరుపుతామని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రత్నకిషోర్‌ స్పష్టంచేశారు. రోగులకు ఇబ్బందులు కలిగిస్తే ఎస్మా ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరించారు. జూడాలు పదేపదే సమ్మెకు దిగడం భావ్యం…

ప్రధాని కార్యాలయంలో నకిలీ మెయిల్‌ సృష్టించిన ఆగంతుకుడు

ఇస్లామాబాద్‌: ప్రధాని పేరిట వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ మెయిల్‌ పాకిస్థాన్‌లో కలకలం సృష్టించింది. ప్రధాని రక్షణ దినోత్సవ సందేశం పేరిట ఓ నకిలీ మెయిల్‌ పాత్రికేయులకు చేరింది. ఇది తరచూ ప్రధాని కార్యాలయం నుంచి మీడియకు పంపే…

142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలి : భాజపా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో 142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. కుంభకోణానికి పాల్పడిన కంపెనీలపై సీబీఐ చేస్తున్న దాడులను భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ స్వాగతించారు. ఈ కుంభకోణంఓ అసలు సూత్రధారులను…

బొగ్గు గనుల కేటాయింపు సరైనదే: జైశ్వాల్‌

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు సరైనదేనని కేంద్ర బొగ్గుశాఖమంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌ అన్నారు. దీని కంటే ఉత్తమమైన విధానం ఏదీ లేదని ఆయన ప్రభుత్వ విధానాన్ని సమర్థించారు. బొగ్గు గనులను పొందిన సంస్థలు వాటిలో తమ కార్యకలాపాలు…

బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌దర్దా ప్రమేయమున్నట్టు సీబీఐ పేర్కొంది. బొగ్గుగనులకు సంబంధించి సీబీఐ దాడులు చేసిన ఐదు కంపెనీల్లో రెండింటిలో దర్దాకు సన్నిహతమని దర్యాప్తుసంస్థ తెలిపింది.