Wednesday, 11 November 2026

వార్తలు

భాజపా కార్యకర్తల అరెస్టు

ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రధాని నావాసం వద్ద ఆందోళనచేసిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళుతున్న వారిని అడ్డుకుని వాటర్‌క్యానన్లు, భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు…

బొగ్గు కుంభకోణంలో నన్ను ప్రశ్నించలేదు:దాసరి నారాయణరావు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణంలో సీబీఐ అధికారులు తనను ప్రశ్నించలేదని తనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల్లో సోదాలు జరగలేదని దాసరి నారాయణరావు తెలిపారు. బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఆ శాఖలో సహాయమంత్రిగా పనిచేసిన దాసరి…

మండలి బుద్ధప్రసాద్‌ దీక్ష విరమణ

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ మూడురోజులుగా దీక్ష చేస్తున్న మండలి బుద్దప్రసాద్‌ ఈ రోజు దీక్ష విరమించారు. డెల్టాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న ప్రభుత్వ హామీతో ఆయన దీక్షను విరమించారు.

తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి:కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. తెలంగాణలో ఆత్మబలిదానాలను కేంద్ర ప్రభుత్వ…

హైకోర్టు తీర్పు మంచి నిర్ణయం: ఎమ్యేల్సీ వై. బి. రాజేంద్రప్రసాద్‌

విజయవాడ: స్థానిక సంస్థలకు ఎన్నికలను జరిపించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం మంచి నిర్ణయమని తెదేపా ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్‌ విజయవాడలో అన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేకధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల పనులు అగిపోయాయని…

ఎస్సీ, ఎస్టీ పదోన్నతులు తొలగిన అడ్డంకులు

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల అడ్డంకులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఇందుకు పచ్చజెండా వూపింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు…

ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయం: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయమని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ అయన జంతర్‌మంతర్‌ వద్ద బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరు దీక్ష శిభిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. శిభిరంలో ప్రసంగిస్తూ..…

తెలంగాణపై బీజేపీ మాట తప్పింది: సీపీఐ

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని నమ్మబలికి తెలంగాణ ప్రజలను బీజేపీ వంచించిందని విమర్శించారు, తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్‌లది…

బొగ్గు కుంభకోణం కేసులో ఐదు కంపెనీలపై కేసులు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అక్రమంగా బొగ్గు కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలపై తాజాగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వీటిలో విన్నీ ఐరన్‌ అండ్‌ స్టీల్స్‌,నవభారత్‌ స్టీల్స్‌ జేఎల్‌డీ యవత్మాల్‌,…

వర్షాల కారణంగా 10 రైళ్ల రద్దు

హైదరాబాద్‌: వర్షల కారణంగా 10 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రథ్‌, విశాఖ-సికింద్రాబాద్‌ దూరంతో, మణుగూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌- మణుగూరు, మణుగూరు-కాజీపేట, కాజీపేట-మణుగూరు, కాజీపేట-డోర్నకల్‌-కాజీపేట, కాజీపేట-విజయవాడ, విజయవాడ-కాజీపేట ప్యాసింజర్లు రద్దు చేశారు. కాజీ పేట-…