Tuesday, 10 November 2026

వార్తలు

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం…

లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమయింది. ఆసియామార్కెట్లలో అనుకూలధోరణి ఏర్పడటం దేశీయస్టాక్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్‌ 84 పాయింట్ల ఆధిక్యంతో నిఫ్టీ 2.4 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్‌కు చెందిన అన్నీ సూచీలు లాభాల్లో వున్నాయి.

పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాగ్‌రగడ మొదలైంది. కాగ్‌ నివేదికపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ వ్యక్తం చేశాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌, రాజ్యసభ…

వైద్యులపై దాడి చేసిన వారి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడి చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమపై దాడికి నిరసనగా జూనియర్‌ వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టడం తెలిసిందే. సమ్మెపై వారు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు…

సమావేశం ఏర్పాటుచేస్తే దీక్ష విరమిస్తా: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మానుకొని విద్యుత్‌ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీక్ష విరమిస్తానని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి  దయాకరరావు స్పష్టంచేశారు. దీక్ష విరమించమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేయగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు…

ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

అంతర్వేది: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురిని మత్స్యకారుల్లో ఆరుగురిని రెవెన్యూ సిబ్బంది. రక్షంచారు. మరో మత్స్యకారుడి కోసం నావికాదళం హెలికాఫ్టర్‌లో గాలింపు చర్యలు జరుపుతున్నారు. బెండ్లుచ బోదెల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నట్టు మత్య్సకారులు తెలియజేశారు.

రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ మృతి

రావులపాలెం: తూర్పుగోదావరి  జిల్లా రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ రాంబాబు అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. పోలీసులు శవాన్ని హడావుడిగా శవపరీక్షకు తరలించడం పలు అనుమానాలకు దారి తీసింది.

నేత కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక  ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం రూ. 2లక్షల అప్పును తీర్చలేననే మనస్థాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. మర…

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

హైదరాబాద్‌: నగరంలో ఉప్పల్‌ స్టేడియాంలో భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య తోలి టెస్టు ప్రారంభమయింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది ఇదిలావుండగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని పోలీసులు స్టేడిమాంలోకి అనుమతించకపోవడంపై అభిమానులు ఆందోళనకు దిగారు. భారత్‌ జట్టు: గంభీర్‌,…

ఆటో ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: ఆటోఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు కనీసరుసుం రూ.16. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.9 గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రినుంచి అమల్లోకి వస్తాయి.