Tuesday, 10 November 2026

వార్తలు

మహాత్మ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం ప్రధాని ఎర్రకోటకు బయలుదేరారు.

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సహాయ మంత్రి పళ్లంరాజు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని త్రివిధదళాల…

గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగరవేసిన :బొత్స

హైదరాబాద్‌: 66వ స్వాతంత్య్రదినోత్సవం వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర ప్రజలకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం…

అసెంబ్లీలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో 66వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జాతీయ జెండా ఎగరవేశారు. శాసన మండలి ఎదుట మండలి ఛైర్మన్‌ చక్రపాణి జాతీయ జెండా ఎగరవేశారు.

16 నాటికి ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సంతాపం తెలిపాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌…

రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్‌ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు…

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన…

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్‌ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో…

సీఎంకు రాజీనామా సమర్పించిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పికి వ్యవహరంలో సీబీఐ ధర్మాన పేరును చార్జషీట్‌లో చేర్చటంలరతో ఆయన మంగళవారం రాత్రి తన రాజీనమా లేఖను సీఎంకు సమర్పించారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకొని తన రాజీ…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపదధ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.